విహారయాత్రకు వెళ్లిన బోటులోకి నీరు

పాపికొండల విహార యాత్రలో తప్పిన  ప్రమాదం

గోల్డెన్ న్యూస్ తూర్పుగోదావరి: పాపికొండల విహార యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటులోకి నీళ్లు చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటకులు, తెలిన  వివరాల ప్రకారం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం నుంచి ఆదివారం నవంబర్ 17 అధిక సంఖ్యలో పర్యాటకులతో పాపికొండల విహారయాత్రకు బోట్లు బయలుదేరి వెళ్లాయి. విహారయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటు కచ్చులూరు- మంటూరు మధ్యకు వచ్చే సరికి,గోదావరి నదిలో నుంచి బోటు ఇంజిన్‌లోకి నీటిని తోడి కూలింగ్‌ చేసి బయటకు పంపించే పైపు (కూలింగ్‌ పైపు) పగిలిపోవడంతో బోటులోకి కొంతమేర  నీరు చేరినట్లు తెలిపారు..

Facebook
WhatsApp
Twitter
Telegram