జార్ఖండ్లో మావోయిస్టుల విధ్వంసం

జార్ఖండ్‌లో రెండో ద‌శ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్రారంభించక ముందే.. మావోయిస్టులు చిలరేగి పోయారు. ఒకేసారి అయిదు ట్ర‌క్కుల‌కు నిప్పు పెట్టారు. ల‌తేహ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెరాంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న లాత్ అట‌వీ ప్రాంతంలో రాత్రి 1.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ల‌తేహ‌ర్‌లో బొగ్గు ప్రాజెక్టు వ‌ద్ద  ఖాళీ చేసి తిరిగి వ‌స్తున్న ట్ర‌క్కుల‌కు నిషేధిత జార్ఖండ్ ప్ర‌స్తుతి క‌మిటీ నిప్పు పెట్టిన‌ట్లు తెలిసింది. ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించారు. వాహ‌నాల‌ను ద‌గ్దం చేసిన కేసులో త‌నిఖీలు చేప‌డుతున్న‌ట్లు ఎస్పీ కుమార్ గౌర‌వ్ తెలిపారు. ఘటన స్థ‌లం వ‌ద్ద క‌ర‌ప‌త్రాల‌ను వ‌ద‌లి వెళ్లారు. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు సాగాలంటే త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆ క‌ర‌ప‌త్రంలో మావోయిస్టులు పేర్కొన్న‌ట్లు ఎస్పీ తెలిపారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram