ఏజెన్సీలో సికిల్ సెల్ అనీమియా నిర్ధారణ పరీక్షలు

ప్రతి ఒక్కరు సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి  డా॥ కె. మధు

   గోల్డెన్ న్యూస్ -భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి

కరకగూడెం గిరిజన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డా. కె. మధు ఆధ్వర్యంలో సికిల్  సెల్ ఎనీమియా (రక్తహీనతతో కూడిక రక్తకణాలు) నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ..ఈ సికిల్ సెల్ నిర్ధారణ పరీక్షలు చిన్న పిల్లల నుండి పెద్దవారికి అందరికి చేయడం జరుగుతుందని తెలియచేయిడం జరిగింది. ఈ పరీక్ష ల వల్ల రక్తంలోని ఎర్ర రక్తకణాలు గుండ్రంగా వుండి శరీరంలోని అన్ని కణాలకు, కణజాలలకు ఎర్ర రక్త కణాలు  ఆక్సిజన్’ను మరియు ఆహారం ద్వారా వచ్చిన ‘శక్తి’ని అందజేస్తాయని అన్నారు.కాని “సికిల్ సెల్ వ్యాధితో భాదపడుచున్న వారికి ఎర్రరక్త కణాల పరిమాణం “కొడవలి ఆకారంలో లేదా అర్ధ చంద్రవంక ఆకారంలో వుండి ఆక్సిజన్ ను, శక్తిని కణాలకు, కణవాలకు సరిగ్గా అందజేయవు. ఫలితంగా వ్యక్తులు నీరసంగా ఉండి శక్తి హీనులవుతారు, తద్వారా బలహీనంగా కనిపిస్తారని తెలిపారు. వారిని ముందుగానే ఈ  పరీక్షల ద్వారా గుర్తించి, చికిత్స అందించినట్లయితే వారి  యొక్క ఆయుష్షును పొడగించవచ్చు అని అన్నారు అందుకే  పైలెట్ ప్రాజెక్టుగా ఏజెన్సీ  జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పి కృష్ణయ్య, హెచ్ వి భవాని, టెక్నీషియన్ కృష్ణ, ఏఎన్ఎం పద్మ, ఆశా కార్యకర్తలు మంగవేణి తదితరులు పాల్గొన్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram