మారుమూల ప్రాంతాలకు స్వచ్ఛంద సంస్థలు తరలి రావాలి.
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్..
వైద్య శిబిరన్ని ప్రారంభించిన ఎస్పీ ..
గోల్డెన్ న్యూస్– భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
అశ్వాపురం : మండలంలోని వేములూరు గిరిజన గ్రామం లో భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో( రోటరీ క్లబ్ భద్రాచలం వారి సౌజన్యంతో) ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు.అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ కృషి చేయడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు ..
Post Views: 72