మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాష
గోల్డెన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్దులకు యూనిఫాంలు తక్షణమే అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండీ యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో యాకూబ్ పాషా పాల్గొని మాట్లాడుతూ..జూన్ 1న కళాశాలలు, జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై 5 నెలలు దాటినా, నేటి వరకు విద్యార్థులకు మైనారిటీ గురుకుల సంస్థల యూనిఫాంలను అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 204 మైనారిటి గురుకుల పాఠశాలలో 64,140 మంది, 204 మైనారిటీ గురుకుల కళాశాలలలో 18,993 మంది కలుపుకుని మొత్తం 83,133 మంది విధ్యార్దినీ, విధ్యార్దులు రాష్ర్ట వ్యాప్తంగా చదువు తున్నారని, యూనిఫాంల కోసం గత 6 నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, యూనిఫాంల పంపిణీ లేకపోవడంతో తీవ్ర అసౌకర్యం, కలుగుతుందని, సమానత్వం, క్రమ శిక్షణని పెంపొందించటంలో యూనిఫాంలు కీలక పాత్ర పోషిస్తాయని, అటువంటి యూనిఫాం అందకపోవటంతో విద్యార్దులలో మనోధైర్యం దెబ్బతినటమే కాకుండా, విభజన కూడా కనిపిస్తుందని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా గల మైనారిటీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్దులకు యూనిఫాం లు అందించి వారిలోని వేరుబాటు తనాన్ని రూపుమాపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మైనారిటీ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ హుస్సేన్ ఖాన్, జిల్లా మైనారిటీ నాయకులు ఆసిఫ్, షకీల్, సలీమ్, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.