కుష్టు నిర్మూలన అవగాహన కార్యక్రమం.

వ్యాధి గుర్తింపు కార్యక్రమం డిసెంబర్ 2 నుండి 15 వరకు కొనసాగుతుంది. డాక్టర్ కె మధు. కరకగూడెం.

గోల్డెన్ న్యూస్ కరకగూడెం: మండలంలోని గిరిజన ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ కే మధు శనివారం ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 2వ తేదీ నుండి 15 వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటి,ఇంటి కి తిరిగి అందరినీ పరీక్షించి శరీరం మీద స్పర్శ లేని, రాగి రంగు లేక లేత గోధుమ రంగు మచ్చలు గుర్తించి వారి పేర్లు నమోదు చేసి. వైద్యాధికారి తో వ్యాధి నిర్ధారణ చేయించి ఉచితం గా చికిత్స అందచేస్తారు అని తెలిపారు..ఈ సర్వే లో ఆశా కార్యకర్తలు ఇంటింటికి చేరుకొని ప్రజల కాళ్లు, చేతులలో తిమ్మిరి, చేతి లేదా పాదాల వేళ్లు వంకర కావడం, పుండ్లు ఏర్పడ్డాయని తెలుసుకుంటారని చెప్పారు. లక్షణాలు బట్టి కుష్టు వ్యాధిని గుర్తిస్తారని చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేస్తే అంగ వైకల్యం రావచ్చు తెలిపారు. కుష్టు వ్యాధి నిప్రాథమిక దశలో గుర్తించి, అంగవైకల్యం రాకుండా నివారించవచ్చును అన్నారు.ప్రజలు సర్వే కార్యక్రమం లో ఆరోగ్య కార్యకర్తల కు సహాకరించి తగిన చికిత్స పొందాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలలో సర్వే చేస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీీఓ కుమార్, ఎంఈఓ గడ్డం మంజుల తదిిిితరులురుత పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram