గోల్డెన్ న్యూస్ నంద్యాల: శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ హీరో అక్కినేని నాగార్జున ఆయన కుమారుడు నాగచైతన్య, అతని భార్య శోధిత శ్రీశైలంలోని మల్లన్న దేవాలయాన్ని సందర్శించారు. ఇటీవలే నూతన దంపతులుగా మారిన అక్కినేని నాగచైతన్య శోభితకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. అక్కినేని కుటుంబం రాకతో శ్రీశైలంలో వారి అభిమానులు సందడి చేశారు. నాగచైతన్య- శోభితలకు శ్రీశైల మల్లన్న ఆశీస్సులు ఉండాలని అభిమానులు కోరుకున్నారు. .
Post Views: 51









