రఘునాధపాలెం సమీపంలో పెద్దపులి అడుగులు గుర్తింపు..
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది.నాలుగు రోజులుగా పులి సంచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జనం భయాందోళనకు గురవుతున్నారు. తాడ్వాయి మండలం పంబాపూర్ గ్రామ సమీపంలో గల అడవిలో బుధవారం రాత్రి పెద్దపులి సంచారంతో అడుగుజాడలను గుర్తించినట్లు ఎస్ఆర్ ఓ సత్తయ్య తెలిపారు. గురువారం అంబాపూర్ అడవులలో గాలించగా ఇసుకలో పులి అడుగు జాడలు గుర్తించామని ఆయన అన్నారు. రాంపూర్ నార్త్ బీట్ సైడు ఒంటరిగా వెళ్లవద్దని తెలిపారు. మూగజీవాల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా మూడు రోజుల క్రితం ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ప్రవేశించిన పెద్దపులి అదేరోజు చుంచుపల్లి వద్ద గోదావరి దాటి మంగపేట మండలంలోకి ప్రవేశించింది.మరుసటి రోజు కరకగూడెం అటవీ ప్రాంతం, ఆళ్లపల్లి మండలంలోని కిన్నెరసాని అడవుల వైపు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కాగా అధికా రులు అనుకున్నట్లుగానే ఆదివారం తిరిగి కరకగూడెం మండలంలో అడుగుపెట్టింది.రైతులు గుర్తించి అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రఘునాధపాలెం అడవుల్లో పులి పులి పాదముద్రలను గుర్తించారు ఈ నేపథ్యంలో పులి సంచారం పట్ల అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పులికి ఎలాంటి హాని కలిగించొద్దని హెచ్చరిస్తున్నారు.