పిచ్చయ్య కుటుంబానికి న్యాయం చేయాలి.

– గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుడు పిచ్చయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. 

– సిఐటి నాయకులు కొమరం కాంతారావు

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం:  కరకగూడెం పంచాయతీలో మల్టీ పర్పస్ కార్మికుడిగా పనిచేస్తున్న ఇల్లందుల పిచ్చయ్య అనారోగ్యంతో  ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు మంగళవారం అధికారులను కోరారు పంచాయతీ కార్మికులు ప్రజల ఆరోగ్యాల కోసం పరిశుభ్రత పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారని వారి సేవలను గుర్తించి. పిచ్చయ్య కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తూ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కుమార్ వినతి పత్రం  అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు సంజీవరావు, ఉప్పల్ సాంబశివరావు, గుమ్మడవెల్లి కృష్ణ, కంగాల సురేష్, శంకర్, వీరస్వామి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Facebook
WhatsApp
Twitter
Telegram