ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపినందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు…
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన శాసనమండలి మీడియా పార్టీ వద్ద మీడియాతో మాట్లాడారు… ఈ సందర్భంగా ఫార్ములా-ఈ రేస్ అన్ని వివరాలు చెప్పారని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. చాలా పారదర్శకంగా చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదని చెప్పారు. ఎలాంటి కేసులైన ధైర్యంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు మండలిలో పోరాడుతామని విపక్ష నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు..