అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు అమిత్‌ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్..

గోల్డెన్ న్యూస్/ మణుగూరు : 75వ జయంతి సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై ‘వ్యాఖ్యలు’ చేసిన నేపథ్యంలో తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు భారత ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని  యావత్ సమాజానికి కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని మండల అధ్యక్షుడు నవీన్ డిమాండ్ చేశారు…

ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ శివ, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాటబోయిన. నాగేశ్వరరావు, నాయకులు కూచిపూడి బాబు, సామా శ్రీనివాస్ రెడ్డి, భల్లెం సురేష్ , గాండ్ల సురేష్ కనక లక్ష్మి, సౌజన్య,వెంకట్రావు గౌడ్, గాండ్ల సురేష్,గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram