మీడియాకు క్షమాపణలు చెప్పిన సీవీ ఆనంద్ !

హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్  సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుతున్నాను” అంటూ పోస్ట్ చేశారు.సంధ్యా ధియేటర్ తొక్కిసలాట విషయం లో ఏ వ్యవస్థ వల్ల  తప్పు జరిగిన తప్పు చేసిన వారిని శిక్షించాలి.. మరోసారి అలాంటి ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలి. జరుగుతోంది వేరు. ఫలితంగా పోలీసులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు.ఎప్పుడూ కూల్ గా ఉండే కమిషనర్ హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్ కూడా తన కోపం తెచ్చుకున్నారు. నేషనల్ మీడియాను అమ్ముడుపోయారని మండిపడ్డారు. ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ఊహించలేకపోయారు.దీనికి కారణం నేషనల్ మీడియా పోలీసుల వాదనను ప్రజలకు చూపించకపోవడమే అని అంటున్నారు. కారణం ఏదైనా ఆయన మీడియాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.కమిషనర్ సీవీ ఆనంద్ కేసులన్నింటినీ ఒకేలా చూస్తారు. సెలబ్రిటీ కేసు..మామూలు కేసు అన్నది కాదు. తప్పు చేసిన వారిని బయటకు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తారు. ఆయన ఒత్తిడికి గురయినట్లుగా ఇప్పటి వరకూ ఎవరూ చెప్పుకోరు. కానీ మొదటి సారి పోలీసులపై నింద పడుతూంటే.. తమ వాదన ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయంతో ఆయన జాతీయ మీడియాపై నోరు జారారు. కానీ వెంటనే దిద్దుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram