గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు 102 ఆంబులెన్స్ ను ప్రారంభించరు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా 102(అమ్మ వాహనం) అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్. కరకగూడెం పిహెచ్సి వైద్యులు కే మధు, తాసిల్దార్ నాగప్రసాద్. ఎంపీ ఓ కుమార్, ఎస్సై ఏ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 43