జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం “50 వ” ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను జయప్రదం చేయండి – గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు -మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే – చందా లింగయ్య దొర..
భద్రాచలంలో ఈనెల 26,27 రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్….
గోల్డెన్ న్యూస్ /పినపాక : ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం 1974 లో ఏర్పడిన జాతీయ ఆదివాసి గిరిజన సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఈనెల 26, 27 తేదీల్లో భద్రాచలంలో నిర్వహించనునట్లు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు.. గిరిజన అభ్యదయ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం పోరాటాల, ఉద్యమాల ఫలితంగా ఆదివాసి హక్కులు, చట్టాలు ప్రజల్లో చైతన్యo ఏర్పడ్డాయని దాని ఫలితంగానే జీవో 3 ద్వారా వందలాది, వేలాది మంది ఉద్యోగాలు పొందారని, అదే విధంగా భూ బదలాయింపు నిషేధ చట్టాలైన 1/59, 1/70, అటవి హక్కుల గుర్తింపు చట్టం – 2006, PESA చట్టం ద్వారా ఆదివాసులు లబ్ధి పొందాలని ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆదివాసులు మెరుగైన అభివృద్ధి కోసం తోడ్పాలని అలాగే గిరిజన ఇసుక సొసైటీల పై జరుగుతున్న అన్యాయాలపై, బి టి పి ఎస్ భూ నిర్వాసితులకు, సీతారామ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుల భూ నిర్వాసితుల పై జరిగిన అన్యాయంపై చర్చ సమావేశం కలదు కావునా ఈ సమావేశానికి ఆదివాసీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని డిసెంబర్ 26, 27 తేదీల్లో జరిగే సెమినార్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క, మరియు అతిధులుగా ఆదివాసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో…జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వజ్జ నరసింహారావు దొర, భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర,భద్రాచలం డివిజన్ నాయకులు సోయం శుక్రామ్ పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను తదితరులు పాల్గొన్నారు..