గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ నాయక్ మంగళవారం పినపాక ప్రభుత్వ ఆసుపత్రిక తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణీ స్త్రీల వివరాల నమోదు, అవుట్ పేషెంట్స్ నమోదు తదితర విషయాలను డాక్టర్ దుర్గాభవానిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా dmho మాట్లాడుతూ ..ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు , సిబ్బంది విధిగా విధులకు హాజరు కావాలని సూచించారని , గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది దీర్ఘకాలిక పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూచించారని డాక్టర్ దుర్గ భవానికి సూచించారు. అదే విధంగా తోగ్గుడెం పంచాయతీ లో గల ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంను తనిఖీ చేసి పలు విషయాలపై సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా , చైల్డ్ హెల్త్ & ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ బాలాజీ నాయక్ , పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దుర్గా భవాని, సిబ్బంది పాల్గొన్నారు.
