లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు

గోల్డ్ న్యూస్/ కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు ఐదుగురు మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పుణెం పాక్షి, వెట్టి దేవ, మడకం ఉంగ్లి, రవ్వ సోమ, మడివి గంగి ఉన్నట్లు ఎస్పీ సమావేశంలో వెల్లడించారు.  ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని కోరారు. మావోయిస్టుల్లో చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నందున, లొంగిపోతే.. తమ కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని సూచించారు.జనజీవన స్రవంతి ద్వారా మెరుగైన జీవితం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని  తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram