గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండలం శ్రీరంగాపూర్ గ్రామం లో నేతకాని కులస్తుల గ్రామసభ కొండగుర్ల కోటి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నేతకాని రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చిన్ని కృష్ణ. పాల్గొని మాట్లాడారు.. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న క్రమంలో నేతకాని కులం ఏ కులం కి ఉప కులం కాదని మేము తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12 నుండి 15 లక్షల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామని ఇప్పుడు వర్గీకరణతో పాటు కులగన చేస్తున్నది కాబట్టి మహానేతకాని కులం ఎంత జనాభా ఉందో లెక్క కట్టి మా సంఘాలకు అప్పజెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం ఎస్సీ ఉప కులాల వర్గీకరణతో పాటు కులగన చేసి అమలు పర్సినట్లయితే మా నేతకాని కులము ఏజెన్సీ ప్రాంతాలలో అదిలాబాదు నుండి భద్రాచలం వరకు ఇరువైపులా గోదావరిని అనుకొని అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఆర్థికంగా వెనుకబడి విద్య వైద్యం ఉపాధికి దూరమై.అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాం నేతకాని కులం పూర్వం నుండి గిరిజనులతో పాటు పోడు భూములు కొట్టుకొని జీవిస్తూ హక్కుపత్రాలు లేక కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు లేక బ్యాంకులు వ్యవసాయ రుణాలు లేక దీనాస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఎవరికి చెప్పుకోలేక అట్టడుగు కులంగా మిగిలిపోయి ఉన్నాము..
నేతకాని కులం ఏ కులానికి ఉప కులం కాదని కోరుకుంటూ కొన్ని ఎస్సీ ఉపకులాలు నేతకాని కులం పేరుతో రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు మా నేతకాని కులం ఏజెన్సీ ప్రాంతాలలో రాజకీయంగా వార్డ్ మెంబర్ తప్ప ఏ పదవి దక్కడం లేదని చిన్ని కృష్ణ గోగు మల్లయ్య అన్నారు ..
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి అవకాశాలు కల్పించలేదు ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన మా పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ కులగణ అమలు చేస్తే మా నేతకాని జాతికి అన్ని రంగాలలో విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయంగా అభివృద్ధి పరిసి ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిపక్షంలో నేతకని జాతి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వానికి విన్నవించుకోవటం జరుగుతుందని వారు అన్నారు..
ప్రధాన డిమాండ్స్
1. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 2. పోడు కొట్టుకున్న భూములకు పూర్వం నుండి ఉన్న భూములకు పట్టాలు హక్కుపత్రాలు ఇవ్వాలి
3.గిరిజనులతో పాటు నేతకాని కులానికి సమాన హక్కులు కల్పించాలి
4.జనాభా తమాషా ప్రకారం విద్యా ఉద్యోగ ఉపాధి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి
5. నేతకాని కులం ఏ కులానికి ఉపకులం కాదు నాకు ప్రత్యేకంగా గెజిట్ నెంబర్ కేటాయించాలి సమగ్ర సర్వే సక్రమంగా చేసి మా జనాభా ఎంతో లెక్క కట్టి చెప్పాలి..
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జాడి నాగరాజుసప్పిడి వెంకటేశ్వర్లు జాడి నాగరాజు దుర్గం ప్రేమ్ కుమార్ కుమ్మరి సమ్మయ్య సల్లూరి వెంకటేశ్వర్లు కరకగూడెం మండలం నాయకులు కొండ గొల్ల వెంకటేశ్వర్లు గోగు సమ్మయ్య సప్పుడు రామ్మూర్తి జాడి చిన్న వెంకటేశ్వర్లు కుమ్మరి కుమారస్వామి జాడి తిరుపతమ్మ జాడి ఐలమ్మ గాంధర్ల మహాలక్ష్మి గోగిల కుమ్మరి మంగమ్మ గోగు సమ్మక్క గాంధర్ల ముసలయ్య గాంధర్ర గంగరాజు గాంధర్ల జానీ బానిస పాపయ్య బానిస రామచంద్రం గాంధర్ల నారాయణ తదితరులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయడం జరిగింది