ఒకరు ఉరి వేసుకోగా — మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య–వరుస ఘటనలతో పోలీస్ శాఖలో కలకలం
గోల్డెన్ న్యూస్/ మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఒకరేమో మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా, మరొకరేమో బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు. వీరిరువురు ఈ రోజు ఉదయం వేర్వేరు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొల్చారం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ క్వార్టర్స్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్న బాలకృష్ణ కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చనిపోగా అతని భార్య తోపాటు ఇద్దరు చిన్న పిల్లల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఆత్మహత్య లు కలకలం రేపుతున్నాయి.