గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : పండగ పూట గాలిపటాలు ఎగరేస్తుంటారు. అయితే ఈ సరదా పలువురి పాలిట శాపంగా మారుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామానికి చెందిన ఏరువా కృష్ణారావు కొత్తగూడెం పట్టణంలోని హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగి. ఈ క్రమంలో విధులు ముగించుకుని తిరిగి ద్విచక్ర వాహనం పై ఇంటికి వెళుతుండగా రామవరం సమీపంలో కొందరు వ్యక్తులు జాతీయ రహదారిపై గాలి పటం ఎగరవేయడం ఆ దారం కృష్ణారావు గొంతుకు తగిలి కోసుకు పోయింది మెడకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు ...
Post Views: 74