పూలేకు నివాళులర్పించిన ఉపాధ్యాయులు.
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అణగారిన వర్గాల హక్కుల కోసం జ్యోతి రావు పూలే ఎంతోమందికి విద్యను అందించిన మహనీయులని కొనియాడారు. మన దేశంలో మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేసి నేటికీ ఎంతో మంది మహిళలకు ఆదర్శనీయమయ్యారని పేర్కొన్నారు. పూలే ఇద్దరు దంపతులు సమాజంలో విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ..ఏన్నో పాఠశాలను ప్రారంభించి ప్రతి ఒక్కరికీ అక్షర జ్ఞానం చేసారని, అలాంటి మహానియురాలిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..
Post Views: 77