ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.అమ్మకు అక్క అంటేనే ఎక్కువ ఇష్టం.. నేనంటే ప్రేమ లేదు, అందుకే చంపేశా.ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న ప్రతీ తల్లిదండ్రులు.. అందులో ఎవరో ఒకరిని ఎక్కువగా ఇష్ట పడడం మన తరచుగానే చూస్తుంటాం. వాళ్లు నిజంగానే ఎక్కువ ప్రేమ చూపించకపోయినా తోటి వాళ్లు అలా ఫీల్ అవుతుండడం కూడా చూస్తుంటాం. అలాగే ఫీల్ అయిందో అమ్మాయి. ముంబైకి చెందిన రేష్మా ముజఫర్ ఖాజీ (41) అనే మహిళ,అక్కని ఎక్కువగా ఇష్టపడుతుందని తల్లిని చంపేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. తన తల్లి సబీరా బానో అజ్గర్ షేక్ తన పెద్ద కుమార్తె జైనాబీ పట్ల ఎప్పుడూ అభిమానం చూపుతోందని రేష్మ నమ్ముతుందని, గురువారం వృద్ధురాలు కుర్లాలోని ఖురేషీ నగర్ ప్రాంతంలోని రేష్మా నివాసానికి వచ్చినప్పుడు ఆమె తన తల్లితో ఈ విషయంపై వాగ్వాదానికి దిగిందని పోలీసులు తెలిపారు.సబీరా బానో అజ్గర్ షేక్‌కు ఒక కుమారుడు అక్తర్ మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిలో రేష్మా చిన్నదని పోలీసులు తెలిపారు.
.