గోల్డెన్ న్యూస్/తెలంగాణ: సంక్రాంతి సెలవుల కోసం ఎప్పుడెప్పుడాని ఎందురు చూస్తున్న విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే శనివారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రటకన జారీ చేసింది. మొత్తం వరుసగా 7 రోజులు. ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులిచ్చింది. ఈ నెల 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయి. దీంతో 7 రోజులు సెలవులు ఇచ్చినట్లైంది. క్రిస్మస్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబర్ చివరలో వరు సగా మూడురోజులు సెలవులొచ్చాయి. విద్యార్థులు సెలవుల నుంచి తేరుకునే లోపే మళ్లీ సంక్రాంతి సెలవులొచ్చేస్తున్నాయి. ఈ నెల 18(శనివారం) నుంచి పాఠశాలలు తిరిగి పెరుగుచుకోనున్నాయి. 19న ఆదివారం కావడంతో మళ్లీ సెలవు.
Post Views: 26