గోల్డెన్ న్యూస్/ ములుగు : వెంకటాపురం మండలం చెలిమెల ముత్యందార అటవీ ప్రాంతానికి వంట చెరువు కోసం ఆదివారం ముగ్గురు వ్యక్తులు వెళ్లగా, అడవిలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ ప్రమాదవశాత్తు కాలు వేశాడు. బాంబు పేలి ఎడమ కాలికి తీవ్ర గాయం అయ్యింది. తోటి వారి సహాయంతో అంబులెన్స్ లో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Post Views: 48