మణుగూరు పట్టణంలో గంజాయి అమ్మే ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మణుగూరు సురక్ష బస్టాండ్ ప్రాంతంలో నార్కోటిక్ డాగ్ రీనాతో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఓ యువకుడు వద్ద జాగీలం ఆగటం తో. అనుమానం వచ్చి పోలీసులు ఆ యువకుడిని పరిశీలించగా 1 కేజీ 600 గ్రాముల గంజాయి లభ్యమయింది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని విలువ రూ.30 వేల ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో నార్కోటిక్ డాగ్ తనిఖీ టీం ఎస్ఐ రంజిత్, డాగ్ యాడ్లర్ నాగుల్ మీరా,సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 37