గోల్డెన్ న్యూస్/ ఇబ్రహీంపట్నం : భవన నిర్మాణం కోసం తాను ఖర్చుచేసిన డబ్బులకు ఇంకా బిల్లు ఇవ్వలేదంటూ తాసిల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ . వివరాల్లోకి వెళితే పట్టణంలోని జెడ్పీ అతిగృహ భవనాన్ని దానయ్య అనే కాంట్రాక్టర్ నిర్మించారు. దానికోసం రూ.50 లక్షలు వెచ్చించారు. భవన నిర్మాణం పూర్తయి చాలా కాలం అవుతున్నప్పటికీ తనకు బిల్లు చెల్లించలేదని వాపోయారు. ‘జెడ్పీ గెస్ట్‌హౌస్ భవన నిర్మాణానికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. ఎమ్మార్వో ఆఫీస్ శిథిలావస్థకు చేరుకోవడంతో జెడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ఏఈ ఆదేశించారు. తీరా నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా బిల్లుల విషయమై ఏఈ కానీ, ఇతర అధికారులు కానీ స్పందించడం లేదు. భవన నిర్మాణానికైన రూ.50 లక్షల అప్పుకు లక్షలకు లక్షలు మిత్తి అయింది. లక్షకు రూ.3 మిత్తి చొప్పున తీసుకొచ్చి కడుతున్నా. ఇదే ఆఫీస్‌లో నా 20 గుంటల భూమిని అమ్మి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించా. వచ్చిన డబ్బుతో ఇక్కడే అప్పులు ఇచ్చినవారికి పంచాను. అయినా అప్పు తీరకపోవడంతో యంజాల్లో ఉన్న 120 గజాల ప్లాట్‌ను అమ్మాను. అయినప్పటికీ అప్పు తీరకపోవడంతో రుణాలు ఇచ్చినవాళ్లు ఇంటికొచ్చి గొడవ చేయడంతోపాటు ఇంటికి తాళం పెట్టారు. ఆ బాధ ఏగలేక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించా. తలుపులు పలగొట్టి తన పిల్లలు రక్షించారు. ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఉన్న భూమి పోయింది, ప్లాటు పోయింది. భార్యా పిల్లలకు, ఇంటికి దూరమైపోయిన. ఇప్పుడు కీసరలో రోజుకు రూ.800 కూలీకి కంప్రెషన్ బండి నడుపుకుంటూ బతుకున్నానని వాపోయారు. కాంట్రాక్టర్‌గా ఉన్న తాను రోజు కూలీగా మారిపోయాను’ అని చెప్పారు. ఇప్పటికైనా దయతలచి తనకు రావాల్సిన డబ్బును ఇప్పించాలని కోరారు
