రైలు కిందపడి యువకుడు మృతి.

గోల్డెన్ న్యూస్/మంచిర్యాల : పెద్దంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేందర్ తెలిపారు. యువకుని వయస్సు 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటుందని, నీలం రంగు టీ షర్టు, నలుపు రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని ఛాతీపై అమ్మ అని పచ్చబొట్టు ఉందని చెప్పారు. ఇది ఆత్మహత్యా లేదా మరే ఇతర కారణాలు వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ అస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే 8328512176, 9701112343 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram