తుంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో అఘోరా హల్చల్..
వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూలగొడతానని అఘోరి ఛాలెంజ్..
వేములవాడ వెళ్తున్న నాగ సాధు అఘోరాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
గోల్డెన్ న్యూస్ / రాజన్న సిరిసిల్లా: వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామన్న అఘోరి, తన శపథం నెరవేర్చుకో వడంలో విఫలమైంది, ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని, తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో ఈరోజు సాయంత్రం పోలీసులు ఆపివేశారు.
తను కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు.
దర్గాను కూల్చి వేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ పట్టణానికి నలువైపులా పోలీసులు మోహరించారు.
పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరీ వ్యవహారం, రోజురోజుకు మితిమీరి పోతుంది, రోజు ఏదో ఒక ఊరికి వెళ్లడం స్థానికులతో గొడవ పడడం గ్రామస్తుల తో వాగ్వాదం పెట్టుకోవడం…రచ్చ రచ్చ చేయడంతో అఘోరి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.