ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది.
గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి కనిపించినట్టు స్థానికులు తెలిపారు. చిరుత పాద ముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి గుండాల ప్రాజెక్టు సమీపంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు మైక్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులి గుండాల సమీపంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్ళాలని సూచించారు. రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు హెచ్చరిక చేశారు.
Post Views: 16