మరో భారీ ఎన్కౌంటర్. 31 మంది మావోయిస్టులుమృతి

ఛత్తీస్‌గఢ్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. బీజపూర్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవరుజామున బీకర కాల్పులు జరిగాయి.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టుల తోపాటు ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. భారీ సంఖ్యలో మావోలు, భద్రతా బలగాలు గాయపడ్డారు. బీజాపూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్కు పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు  ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టీఎఫ్‌ కు చెందిన భారీ సంఖ్యలో పోలీసులు యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడ హతం కాగా, ఇద్దరు సైనికులు కూడా మృతి చెందారు.  గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగనుందని సమాచారం. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు. 31 మందిలో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల ఎస్పీలు తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది మావోయిస్టులను గుర్తించామని తెలిపారు.. 16 మంది నక్సలైట్లపై రూ. 1 కోటి 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందని అన్నారు. మరో 15 మంది మావోయిస్టుల గుర్తించాల్సి ఉందన్నారు. మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram