మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

మృతులు హైదరాబాద్ చెందినవారీగా గుర్తింపు 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ :మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగు తోన్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తోన్న యాత్రికుల మినీ బస్సు, ఓ ట్రక్కును మంగళవారం ఉదయం ఢీకొట్టింది.

 

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. జబల్బూర్ సమీపంలోని సిహోరో వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిని తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

 

నాచారానికి చెందిన 25 మంది కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లి.. పుణ్యస్నా నం చేసి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. క్షతగాత్రుల ను చికిత్స కోసం ఆసుప త్రికి తరలించారు.

 

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సెనా, ఎస్పీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది.

 

తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రయాణిస్తోన్న మినీ బస్సు.. సిరోహ పట్టణం వద్ద వంతెనపై ట్రక్కు ను ఢీకొట్టిందని జబల్‌పూర్ కలెకట్ర్ దీపక్ కుమార్ సక్సెనా తెలిపారు.

 

ఘటనా స్థలిలోనే ఏడుగు రు చనిపోయారని, మరో 16 మంది గాయపడ్డారని చెప్పారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ట్రక్కు రావడంతో ప్రమాదం జరిగినట్టు వివరించారు.

 

క్షతగాత్రులను చికిత్స కోసం సిరోహి ఆసుపత్రికి తరలిం చామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. మెరుగైన వైద్యం కోసం జబల్‌‌‌పూర్‌కి తరలించినట్టు పేర్కొన్నా రు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది.✍️ సేకరణ కాజీపేట కృష్ణప్రసాద్ ECIL HYD 🌷🙏

Facebook
WhatsApp
Twitter
Telegram