అయ్యో పాయం ఆదివాసీ ఉద్యోగులపై కపట ప్రేమ.

ఆదివాసి ఉద్యోగులు ఏం పాపం చేశారు..

ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు మిన్నా..

ఆదివాసి జెఎసి మండల అధ్యక్షుడు పోలెబోయిన వెంకటనారాయణ..

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల బంజారా ఉద్యోగులకు గత మూడు సంవత్సరాల నుండి “సంత్ సేవాలాల్ మహారాజ్ ” బంజారాల ఆరాధ్య దైవం పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ది. 15-2-2025 న రాష్ట్ర ప్రభుత్వం వారు లంబాడీలకు ప్రత్యేకమైన సెలవు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా ఆదివాసీ సంఘాలు ప్రకటించాయి. ఆ సేవాలాల్ ఎక్కడ ఏ రాష్ట్రంలో పుట్టినాడో బంజరులు ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ కులంలో ఉండాలని స్వచ్ఛందంగా ప్రకటించుకోవాలి . ఉదా:-మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలుగా ఉండాలి. ఉనికి కోసం గుర్తింపు కోసం వివిధ రకాలైన దేవతలను ప్రజల ముందుకు తెచ్చి ఆదివాసీ ఉద్యోగులకు, విద్యార్థులకు, ప్రజానీకానికి మొత్తం మీద ఆదివాసి సమాజానికే చేటు తెచ్చే పాలకుల ఓటు రాజకీయానికి స్వస్తి పలకాలి. ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఆదిపరాశక్తి సమ్మక్కకు లేని సెలవు కులగురువులకు ఎందుకు ? . ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తేదీకి లేని ప్రత్యేకత సేవాలాల్ జయంతికి ఎందుకు ఇస్తున్నారు పరిపాలించే నాయకులకు అర్థం కావలసిన అవసరం ఉంది. ఆదివాసి పేరుతో గెలిచిన ఆదివాసి ఎమ్మెల్యేలు ఎలా నిద్రపోతున్నారు కేవలం ఓట్ల కోసం ఆదివాసిగా చెప్పుకునే ఎమ్మెల్యేలు కూడా ఆదివాసీలను మోసం చేస్తున్నారు. ఒకసారి ఆదివాసీ ప్రజానీకం ఆలోచించండి వందకు వందశాతం బంజారా ఉద్యోగులు ఉన్న పాఠశాలల పరిస్థితి ఏమిటని ఆదివాసీ ప్రజానీకం ప్రశ్నిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఉద్యోగ నియామకంలో ఒక్క ఉద్యోగం కూడా ఆదివాసీలకు దక్కకుండా చేసిన బంజారులకు ఈ సెలవు తీసుకునే అర్హత లేదు. కనీసం ఆదివాసీలకు సేవ చేసే విధానం కూడా బాగాలేదు. ఇప్పటికైనా ఇలాంటి కుల సమస్యలను పాలకులు ఆలోచించాలని అన్ని ఆదివాసి సంఘాలు మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల ఆదివాసి జెఎసి ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, కమిటీ సభ్యులు పోలేబోయిన కార్తీక్ , కలం నాగకృష్ణ, కలం సంపత్ , పోలెబోయిన రాజు, సుతారి నాగేశ్వరరావు, ఊకే నరేష్ , చందా అశోక్, పోలెబోయిన సత్యనారాయణ, కొమరం సాంబశివరావు, పోలెబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram