పేద విద్యార్థుల చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలకొల్పిన సంక్షేమవసతి గృహాల్లో వసతులు కరవై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డైనింగ్ హాల్, నీటి వసతి, మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిపోయే సంఖ్యలో ఉండటం లేదు.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ గిరిజన బాలుర వసతి గృహంలో 200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టల్ సమస్యల వలయంగా మారిందని అధికారులు పట్టించుకోవడం అధికారులు విఫలమయ్యారని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. శనివారం మండలంలోని చిరుమళ్ళ బాలుర వసతి గృహాన్ని భద్రాద్రి జిల్లా ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. చిరుమళ్ళ గిరిజన బాలుర వసతి గృహంలో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.. విద్యార్థులకు మెనూలో ఏ ఒక్కటి పాటించకపోవడం నీటి సదుపాయం సరిగా లేకపోవడం కొన్ని బ్లాకులలో కరెంటు కొరత ఉండడం నాణ్యమైన పద్ధతిలో వంట చేయకపోవడం వంట చేసేవారు కూడా మద్యం సేవించి వంట చేస్తున్నారని ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయన్నారు. ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత వార్డెన్లపై ఉంది. కానీ వారు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులే చెబుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్నా తమ గురించి పట్టించుకోవడం లేదని అంటున్నారు. వార్డెన్ పర్యవేక్షణ లేనందుకే వసతిగృహాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. అయినా, వార్డెన్లలో మార్పు కనిపించడం లేదన్నారు. రోజూ రాత్రి 8 నుంచి 9 గంటల వరకూ విద్యార్థులను చదివించాల్సిన బాధ్యతను వార్డెన్లపై ఉంచారు. కానీ ఉపాధ్యాయులు విస్మరిస్తున్నారు. ఈ సమస్యలపై స్కూల్ హెచ్ఎం మరియు వార్డెన్ని వివరణ కొరకు సంప్రదించగా వారు అందుబాటులో లేరు. కనీసం చరవాాణి ద్వారా సంప్రదించాలని ప్రయత్నించిన అందుబాటులో లేరు. ఇటువంటి దుర్భర పరిస్థితులలో చిరుమళ్ళ హాస్టల్ ఉందనీ పేద విద్యార్థుల చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలకొల్పిన గిరిజన సంక్షేమవసతి గృహాల్లో వసతులు కరవై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డైనింగ్ ఆల్, నీటి వసతి, మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిపోయే సంఖ్యలో ఉండటం లేదు. స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు. ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు..
హాస్టల్ వార్డెన్ వివరణ ..
చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో 200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.వసతి గృహంలోని వసతుల విషయంపై ఉన్నతాధికారులకు విన్నవించాము ప్రధానంగా మరుగుదొడ్లు. మూత్రశాలలు, స్నానపు గదులు, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అధికారుల నుంచి అనుమతులు రాగానే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము తిరుమల హాస్టల్ వార్డెన్ శేఖర్ తెలిపారు..
Post Views: 31