వాట్సాప్ చాటింగ్ ప్రాణం తీసింది.!

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలికతో 9వ తరగతి చదువుతున్న బాలుడు చేసిన వాట్సాప్‌ చాట్ అతని ప్రాణం మీదకు తెచ్చింది. బాలిక కుటుంబసభ్యులు ఫోన్లోనే వాట్సప్ చాట్ ను గమనించి  మనోజ్(15)ను బెదిరించడంతో అతడు భయపడి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి గ్రామంలో  చోటుచేసుకుంది. మనోజ్ రోజు బాలికతో వాట్సాప్‌లో చాటింగ్ చేయడంతో ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు వైద్యం పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram