అత్యంత క్లిష్టంగా లోపల పరిస్థితి
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాద ఘటన స్థలానికి వెళ్లడం పెద్ద సవాల్‌గా మారింది. అక్కడ జరిగిన ఘటన ఇంజినీరింగ్ వర్గాలను కలవరపెడుతోంది. పెద్ద ఎత్తున చేరుకుంటున్న నీటిని తోడివేయటం సమస్యగా మారటంతో పాటు మట్టి, బురదను తొలగించడం రెస్య్కూ బృందాలకు క్లిష్టమైన పనిగానే చెప్పవచ్చు. ప్రమాద దాటికి సొరంగంలో ఉన్న వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది విగత జీవులుగా మిగిలిపోయారన్న అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. శనివారం రాత్రి ఒక టీం ప్రమాద స్థలం వద్దకు చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున బురద, నీరు నిలిచి ఉండడంతో వెనుగిరికి వచ్చారు. ఆదివారం ఉదయం ప్రత్యేక బృందాలు టన్నల్ లోకి వెళ్లారు. 30 ఫీట్ల ఎత్తు ఉన్న టన్నిల్ 25 ఫీట్ల వరకు బురద.. నీటితో నిండి ఉంది. ఆక్సిజన్ పైప్ లైన్ తెగిపోవడంతో 8 మంది బురదలో కూరుకు పోయి ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తం కావు తున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లి వచ్చిన మంత్రి జూపల్లి సైతం. మీడియా సమావేశంలో ఆ ఎనిమిది మంది సేఫ్ గా ఉండే అవకా శాలపై ఏమి చెప్పలేమని పేర్కొనడం అ అభిప్రాయాలకు మరింత బలం చేకూరుతుంది. అయినప్పటికీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తంకుమార్ రెడ్డి. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సంఘటన స్థలంలోనే సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 11 గంటలు ప్రాంతంలో లో దిస్నీ టీం టన్నెల్లోకి వెళ్ళింది. తెల్లవారులు ఆ ఎనిమిది మంది ఆచూకీని కనుకునే ప్రయత్నాలు సాగించనున్నట్లు తెలుస్తోంది.