పీడీఎస్ బియ్యం పట్టివేత..

అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని కరకగూడెం పోలీసులు పట్టుకున్నారు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులు పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కరకగూడెం ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సీతారాంపురం గ్రామం వద్ద సోమవారం వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కరకగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్, పద్మాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ నోమన్ ఇద్దరు కలిసి 20 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని అశోకా లైలాండ్  వాహనంలో అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకొని పంచనామా నిర్వహించి బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేసి, ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు  ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram