నిర్మల్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పు వెల్లడించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కలెక్టర్, ఆర్డీవో జాప్యం చేసిన నేపథ్యంలో నిర్మల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.1999లో గడ్డెన్న, శ్రీరాంసాగర్ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కలెక్టర్ రూ.6.79 కోట్లు, ఆర్డీవో కార్యాలయం 1.45కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. కానీ నష్టపరిహారం చెల్లించడంలో కలెక్టర్, ఆర్డీవో జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
Post Views: 18