ఏసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ ఎస్ ఐ, కానిస్టేబుల్

గోల్డెన్ న్యూస్ / భైంసా : ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి నుండి లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నిర్మల్ జిల్లాలో అక్రమంగా కళ్ళు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఫిర్యాదుదారుని వద్ద నుండి రూ.10వేలు లంచం తీసుకుంటూ బైంసా మండలంలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నిర్మల పాటిల్, కానిస్టేబుల్ సాలికే సుజాత అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల వద్ద నుండి లంచం అడిగితే 1064కు డయల్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram