కాంగ్రెస్ పై మధు యాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్

రెడ్డిలు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండవు కానీ బీసీలను మాత్రం సస్పెండ్ చేస్తారా ? అంటూ ఫైర్

 

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త గ్రూప్ రాజకీయం ఊపందుకుంది. బీసీ కులగణనతో కాంగ్రెస్ మొదలుపెట్టిన రాజకీయం తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్, రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 

కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు , అగ్ర కులాల ఆధిపత్యం పెరిగిపోయిందని, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండవు కానీ బీసీలను మాత్రం సస్పెండ్ చేస్తారా ? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పారని , సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డి పై బహిరంగంగా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మరి ,చిన్నా రెడ్డి మీద లేని క్రమ శిక్షణ చర్యలు బీసీ నేతల మీద ఎలా తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు.

 

కులగణన మీద బీసీ నాయకులతో చర్చ పెట్టాల్సిన రేవంత్, జానారెడ్డిని లాంటి అగ్రకుల నాయకులని మాత్రమే కలిసి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ని , బీసీ నాయకుడు అయిన నన్ను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర కులాలదే పై చేయి అయిందని, బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram