జోగులాంబ గద్వాల జిల్లాలో లేడి అఘోరి హల్ చల్..
అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శాలి పైల్వాన్ దర్గాను తొలగిస్తానని కామెంట్ చేసిన నాగసాధు అఘోరీ..
శనివారం అలంపూర్ వెళ్తున్న అఘోరిను అడ్డుకున్న పోలీసులు..
ఉండవెల్లి మండలం బైరాపురం చౌరస్తా దగ్గర ఆఘోరీ నాగసాధు ను అడ్డుకున్న పోలీసులు..
అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న అఘోరి..
అఘోరీ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించనున్న పోలీసులు..
సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శాలి పహిల్వాన్ దర్గాను తొలగించాలంటూ మహిళా అఘోరీ నాగ సాధువు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంతో శనివారం మహిళ అఘోరీ నాగ సాధువు వస్తుందన్న సమాచారంతో శాంతి భద్రతలు విఘాతం తలెత్తకుండా ముందస్తుగా అఘోరీని అలంపూర్ ఆలయాలకు రాకుండా అడ్డుకొని అరెస్ట్ చేశారు. అఘోరీ కారులో చాలా విగ్రహాలు పెట్టుకుని, పూజలకు సంబంధించిన సామాగ్రి తో అలంపూర్ ఆలయాలకుసంబంధించిన సామాగ్రి తో అలంపూర్ ఆలయాలకు వెళ్లడానికి కారులో రావడం జరిగింది. పోలీసులు అలంపూర్ వెళ్లడానికి అనుమతి లేదు అని అన్న అఘోరీ వెళ్తానని మొరాయించడంతో అఘోరి వాహనంతో సహా ప్రైవేట్ టోయింగ్ వాహనంతో హైదరాబాదుకు తరలించారు. అఘోరి కి సంబంధించిన అరెస్టు లో డీఎస్పీ మొగులయ్య, ఇద్దరు సీఐలు, ఇద్దరు మహిళ ఎస్సైలు,పోలీసులు పాల్గొన్నారు.
<