గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : లీగల్, జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. బుధవారం జరిగిన విచారణలో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరోపణలపై జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు.
ముఖ్యంగా రెండు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు పోలీసులు నిర్ధారించారు.
♦పాల్వంచ టౌన్ ఘటన:
పాల్వంచ పట్టణ ఎస్‌ఐ డి. రాఘవయ్య వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో వారి మద్యం స్థాయి అధికంగా ఉండటంతో, వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు విచారణలో ఇద్దరికి జరిమానా విధించబడింది.
♦లక్ష్మీదేవిపల్లి ఘటన:
లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ జి. రమణారెడ్డి తనిఖీల్లో నలుగురు వ్యక్తులు మద్యం తాగినట్టు బ్రీత్ ఎనలైజర్ ద్వారా నిర్ధారణ కావడంతో, వారినీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నలుగురిపై కూడా జరిమానాలు విధిస్తూ తీర్పు వెలువరించింది.
పోలీసు శాఖ తెలిపిన ప్రకారం, మద్యం సేవించి వాహనం నడిపిన వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించకూడదన్న నిబంధనను పాటించకపోతే, జరిమానాలతో పాటు జైలుశిక్ష కూడా తప్పదని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజల్లో అవగాహన పెంచి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.