గోల్డెన్ న్యూస్ / మణుగూరు : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దరివాడు అని, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం టిడిపి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణగారిన కులంలో పుట్టిన అంబేడ్కర్ నవభారత సమాజ స్థాపనకు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించారన్నారు. 56 దేశాల రాజ్యాంగాలను అవపోసన పట్టి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సైతం రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో జరగబోయే సమస్యలను సైతం ముందుచూపుతో ఆలోచించి వాటి పరిష్కారానికి చట్టాలను, సూచనలను అంబేడ్కర్ పొందుపరిచారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేడ్కర్ బడుగుల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేశారన్నారు. కుల వివక్ష నిర్మూలనకు పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.









