కారు డోర్లు లాకవడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

గోల్డెన్ న్యూస్ / రంగారెడ్డి :  చేవెళ్ల మండలం దామరగిద్దలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. బంధువుల వివాహానికి వచ్చిన అక్కచెల్లెళ్ల పిల్లలు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4).. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. అయితే, కారు డోర్లు లాక్ పడటం, అది ఇతరులెవరూ గమనించ లేదు. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

Facebook
WhatsApp
Twitter
Telegram