గీత దాటితే వేటే… సీఎం రేవంత్‌రెడ్డి

గోల్డ్ న్యూస్ /హైదరాబాద్: పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదు’’ అని తేల్చి చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram