సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన.

గోల్డెన్ న్యూస్/ అమరావతి : ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఇవాళ రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుం టారు. అక్కడినుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు.

 

చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనే శ్వరి, లోకేశ్‌ దంపతులు వెళుతున్నారు. ఈ పర్యటనలోనే ఈనెల 20న చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉండనున్నారు.

 

ఏటా ఒకసారి కుటుంబంతో కలిసి కొంత సమయం విదేశాల్లో గడిపే ఆనవాయి తీ పాటిస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఏప్రిల్ 17వ తేదీ ఉదయం ఒంటి గంటకు ఢిల్లీ అంతర్జాతీయ విమా నాశ్రయం నుంచి విదేశా లకు బయలుదేరనున్నారు.

 

ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ విదేశాలకు వెళ్తున్నారు. విదేశీ పర్యటనను ముగిం చుకుని తిరిగి ఏప్రిల్ 21వ తేదీ అర్ధరాత్రి అమరావతికి చేరుకుంటారు.

Facebook
WhatsApp
Twitter
Telegram