ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు నోటీసులు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్

ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్సీయూలో AI చిత్రాన్ని IAS అధికారిణి స్మితా సబర్వాల్ తన ఎక్స్ X లో రీ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే X హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఓ ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. హెచ్ సీయూ లోపల మష్రూమ్ రాక్ ముందు భారీగా బుల్డోజర్లు వాటి ముందు జింక, నెమలి గిబ్లి శైలిలో ఉంది. ఈ పోస్ట్ ను స్మితా సబర్వాల్ తన ఎక్స్ లో రీ పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించి ఆమెకు నోటీసులిచ్చారు. 400 ఎకరాల భూముల్లో భారీగా బుల్డోజర్లు జింకలను, నెమల్లను తరిమేస్తున్నట్లు ఫోటోలు,వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ప్రభుత్వం ఆయా అకౌంట్లపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని స్మితా సబర్వాల్‌ కు బీఎన్ఎస్ సెక్షన్ 179కింద నోటీసులిచ్చినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. తనకు నోటీసులివ్వడంపై స్మితా సబర్వాల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram