తండ్రికి తలకొరవి పెట్టని కొడుకు, చివరకు తలకొరివి పెట్టిన కూతురు

గోల్డెన్ న్యూస్ / మహబూబ్ :  జిల్లాలోని  పద్మావతి కాలనీకి చెందిన మాణిక్యరావు అనే వృద్ధుడు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన మృతి తర్వాత కుటుంబంలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందు ఆస్తి కోసమే కొడుకు గొడవపడ్డాడు.

 

వివరాలలోకి వెళితే, మాణిక్యరావు కుమారుడు తండ్రికి తలకొరివి పెట్టేందుకు నిరాకరించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ. కోటి విలువైన ఇల్లు మరియు పది తులాల బంగారాన్ని తన పేరు మీద రాయిస్తేనే తలకొరివి పెడతానని కుటుంబసభ్యుల ఎదుట స్పష్టం చేశాడు. ఈ ఆస్తి కోసం తండ్రి మృతదేహాన్ని కూడా లెక్కచేయకపోవడం కుటుంబాన్ని కలచివేసింది.

 

 

అయితే మాణిక్యరావుకు ఉన్న చిన్న కూతురు మాత్రం అన్నయ్య తీరు చూసి ఆవేదనకు లోనయ్యింది. తండ్రి మీద ఉన్న ప్రేమతో, తమ సంప్రదాయాలకూ విలువ ఇస్తూ, తానే తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటనకు పరోక్షంగా బంధువుల మద్దతు లభించింది. వారు కూడా చిన్న కూతురి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

 

 

ఈ ఘటన కుటుంబ వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నదే కాదు, ఆస్తి ముందు మానవ సంబంధాలు ఎలా విలువ కోల్పోతున్నాయో కూడా ఆవిష్కరిస్తుంది. తండ్రిని చివరిసారి గౌరవించేందుకు కూడా సంతానం షరతులు పెట్టడం విషాదకరం అనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది

Facebook
WhatsApp
Twitter
Telegram