గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల విద్యా వనరుల కేంద్రం(ఎంఈఓ ఆఫీస్)లో మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల 3,4,5వ తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో విద్యార్థుల హోంవర్క్ కోసం జిల్లా కలెక్టర్ విద్యా పై ప్రత్యేక శ్రద్ధతో డబల్ రూల్ నోట్ పుస్తకాలు ఐటీసీ సంస్థ ద్వారా పంపించారు. ఆ నోట్ పుస్తకాలను కరకగూడెం ఎంఈఓ మంజుల చేతుల మీదుగా నోట్ పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది..
మండల విద్యాశాఖ అధికారి జి మంజుల మాట్లాడుతూ.. మండలంలోని 25 ప్రాథమిక పాఠశాలలకు 3, 4, 5వ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సదరు నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందించి వేసవి సెలవుల్లో విద్యార్థులకు రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్ అయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు