నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్. : నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్‌లో 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో ఆస్పత్రి ఆవరణ అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐదవ అంతస్తులో ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉన్నాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కాగా, 5వ అంతస్తులో ఉన్న పేషెంట్లను ఇతర వార్డులకు తరలిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.

Facebook
WhatsApp
Twitter
Telegram