ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : సమస్యలు పరిష్కారం పోరాటాలే  శరణ్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం చర్ల మండలంలో ఆ పార్టీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో లేనిపోని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. తాము చేసే పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వివిధ సమస్యలపై తహసీల్దార్ శ్రీనివాస్ కు  వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలగాని బ్రహ్మచారి, రేపాక శ్రీనివాస్, మండల కార్యదర్శి మచ్చ రామారావు, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram