గోల్డెన్ న్యూస్ /అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
అదేవిధంగా ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా విడు దల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు ‘మన మిత్ర’ వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మన మిత్ర’ వాట్సాప్ నెం. 95523 00009కు హాయ్ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఆపై ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే, ఫలితాలు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతాయి.
తాజాగా విడుదలైన పది తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో అబ్బాయిలు 78.31 శాతం ఉండగా, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కాగా, మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.
వారిలో 5,64,064 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చెందిన వారు ఉండగా.. తెలుగు మీడియంలో వారు 51,069 మంది విద్యార్థులు ఉన్నారు.